ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం..

by sudharani |
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనేది.. పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి, హక్కును గౌరవించడానికి, సమర్థించడానానకి, ప్రభుత్వాలకు వారి కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసం పాటించబడింది.

1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్‌లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.

Advertisement

Next Story