- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ దేశ మాజీ అధ్యక్షుడిని చంపేస్తాం’
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.. తాజాగా అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తమ దేశ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమానిని చంపినందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ అధినేత అమిరాలి హజీజాదే అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అంతమొందిస్తామంటూ ఆయన హెచ్చరించారు. 1,650 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్ క్షిపణిని అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.
ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణించారు. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించాయి. అయితే అమాయక సైనికులు తమ టార్గెట్ కాదని తమ టార్గెట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన మైక్ పాంపియో(అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి) కూడా ప్రాణాలతో ఉండకూడదన్నారు.