- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాడికి ముందే అమెరికాకు సమాచారమిచ్చాం: ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై దాడికి ముందే ఈ విషయంపై అమెరికాకు సమాచారమిచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ తెలిపారు. ఆపరేషన్ పరిమితంగానే ఉంటుందని తెలియజేసినట్టు చెప్పారు. ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ దాడులు చేయలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ను శిక్షించడానికి దాడి చేయలేదని, తమ భద్రతకు మాత్రమే చేశామని వెల్లడించారు. అమెరికన్ పౌరులు, యూఎస్‌కు సంబంధించిన స్థావరాలనూ లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. ఇజ్రాయెల్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనూ దాడికి పాల్పడలేదని తేల్చి చెప్పారు.
మరోవైపు ఇరాన్‌తో వివాదం ఇంకా ముగియలేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. సమయం వచ్చినప్పుడు ఇరాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా కూటములను నిర్మిస్తామని తెలిపారు. ఎదురుదాడికి మద్దతివ్వకుండా ఇరాన్ అమెరికాను హెచ్చరించిందని వెల్లడించారు. సిరియా, జోర్డాన్, ఇరాక్‌లోని యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించిందని ఆరోపించారు.