అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ ఔట్: ట్రంపునకు మద్దతిస్తున్నట్టు వెల్లడి

by samatah |
అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ ఔట్: ట్రంపునకు మద్దతిస్తున్నట్టు వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపునకు తన మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షునిగా పోటీ చేయాలని భావించిన రామస్వామి.. 2023 ఫిబ్రవరి నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఇమ్మిగ్రేషన్, అమెరికా విధానాలు తదితర వాటిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసి రిపబ్లికన్ ఓటర్ల మద్దతు పొందగలిగారు. అయితే తాజాగా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి అయోవా కాకస్‌లో ఓటింగ్ జరిగింది. దీనిలో ట్రంప్ విజయం సాధించగా వివేక్‌కు కేవలం 7.7శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో రేసు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన మద్దతుగా నిలిచారు. ‘21వ శతాబ్దపు ఉత్తమ అధ్యక్షుడు’ అని ట్రంప్‌ను ప్రశంసించారు. కాగా, రామస్వామి ఓహియో వ్యవస్థాపకుడు. తన తల్లిదండ్రులు భారత్‌లోని కేరళ రాష్ట్రానికి చెందిన వారు.

Advertisement

Next Story

Most Viewed