Viral: ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్!.. వైరల్ గా మారిన ఏఐ వీడియో

by Ramesh Goud |
Viral: ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్!.. వైరల్ గా మారిన ఏఐ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్ అయ్యారు. దీనికి సంబందించిన ఏఐ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుత సమాజంలో ఏఐ వీడియోల యుగం నడుస్తోంది. ఇందులో మనం చేయనివి చేసినట్టుగా.. చేసినవి చేయనట్టుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోని ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసినట్లుగా క్రియేట్ చేసిన ఏఐ వీడియో ఒకటి బయటకి రాగా.. ఇప్పుడు అదే ప్రముఖులు గన్ లతో బెదిరింపులకు పాల్పడి అరెస్ట్ అయినట్లు మరో వీడియో బయట పడింది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ ఓ షాపింగ్ మాల్ లో గన్ తో బెదిరింపులకు పాల్పడగా.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు కృత్రిమ మేథ ద్వారా క్రియేట్ చేశారు.

అలాగే కమలా హారిస్ కూడా గన్ తో వీధుల్లో హల్ చల్ చేసి అరెస్ట్ అయినట్లు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జేమ్స్ బాండ్ రేంజ్ లో గన్ తో యాక్టింగ్ చేస్తున్నట్లు వీడియో తయారు చేశారు. ఇక వీరితో పాటు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, జో బైడెన్, బరాక్ ఒబామా, పుతిన్ సహా పలువురు దేశాధ్యక్షులు వివిధ ఆయుదాలతో ప్రజలను బెదిరింపులకు గురి చేయగా.. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఐ ద్వారా సృష్టించిన వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చివరిలో దీన్ని డైరెక్ట్ చేసినది డార్ బ్రదర్స్ అని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి వీడియో రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల స్టంట్స్ లో భాగంగానే ఇవి బయటకి వస్తున్నాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed