Venezuela:స్పెయిన్ కు పారిపోయిన వెనిజుల ప్రతిపక్ష నేత గొంజాలెజ్

by Maddikunta Saikiran |
Venezuela:స్పెయిన్ కు పారిపోయిన వెనిజుల ప్రతిపక్ష నేత గొంజాలెజ్
X

దిశ, వెబ్‌డెస్క్:జూలై నెలలో జరిగిన ఎన్నికల్లో వెనిజుల(Venezuela) దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో(Nicolas Maduro) విజయం సాధించిన విషయం తెలిసిందే.ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో మడురోపై ఓడిపోయిన ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థి, 75 ఏళ్ల ఎడ్మండో గొంజాలెజ్(Edmundo Gonzalez) కూడా ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించారు. కౌంటింగ్ లో భారీగా అవినీతి జరిగిందని అతను ఆరోపించాడు. అయితే వెనిజులలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కుట్ర, హింసాత్మక ఘటనలకు గొంజాలెజ్ కారణమని ఆరోపిస్తూ వెనిజులా ప్రాసిక్యూటర్‌ కార్యాలయం వారం రోజుల క్రితం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.దీంతో అతడు గత కొన్ని రోజులుగా అరెస్టు నుంచి తప్పించుకుంటూ వెనిజులాలోని స్పెయిన్‌(Spain) ఎంబసీలో ఆశ్రయం పొందాడు.తాజాగా అతడు ప్రత్యేక విమానంలో ఆదివారం స్పెయిన్‌కు వెళ్లారని వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.అయితే ఈ వార్తపై స్పెయిన్ విదేశాంగ మంత్రిత్వ (foreign ministry) శాఖ కూడా స్పందించింది. గొంజాలెజ్ తన భార్యతో కలిసి టొరెజోన్ డి అర్డోజ్(Torrejon de Ardoz) సైనిక స్థావరానికి చేరుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. గొంజాలెజ్ నిష్క్రమణపై వెనిజులా ప్రభుత్వంతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.

అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఏజెంట్‌గా వ్యవహరించిన గొంజాలెజ్‌ ఆ దేశాల మద్దతుతో అధ్యక్ష పదవిని ఏదో ఒక విధంగా చేజిక్కించుకోవచ్చని భావించారు.కానీ అవేమి ఫలించక పోవడంతో దేశాన్ని విడిచిపెట్టి స్పెయిన్ దేశానికి పారిపోయారు. అయితే గొంజాలెజ్‌ దేశాన్ని విడిచిపెట్టారన్న వార్తపై యూరోపియన్ యూనియన్(EU) విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్(Josep Borrell) స్పందించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడూతూ.. ఈ రోజు వెనిజులాలో ప్రజాస్వామ్యానికి విచారకరమైన రోజని ,ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడూ మరొక దేశంలో బలవంతంగా ఆశ్రయం పొందకూడదని ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed