ట్రంప్ హత్యకు కుట్ర చేసింది ఆ దేశమే.. US ఇంటలిజెన్స్ రిపోర్ట్‌లో వెలుగులోకి సంచలన విషయం..!

by Satheesh |
ట్రంప్ హత్యకు కుట్ర చేసింది ఆ దేశమే.. US ఇంటలిజెన్స్ రిపోర్ట్‌లో వెలుగులోకి సంచలన విషయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జూలై 13న పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందే ట్రంప్‌ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు యూఎస్ ఇంటలిజెన్స్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం.

ఇంటల్ రిపోర్ట్‌తో అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెసెస్ ట్రంప్‌కు భద్రతాను కట్టుదిట్టం చేసింది. ట్రంప్‌పై ఎటాక్ జరిగిన రోజు కూడా భద్రతా పెంచడంతోనే ఆయన ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నట్లు టాక్. అయితే, ట్రంప్‌పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్‌కు ఇరాన్‌తో పాటు ఇతర ఏ దేశంతో సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు నిర్ధారించారు. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హైలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనక అమెరికా హస్తం ఉందని అనుమానిస్తోన్న ఇరాన్.. ఇందులో భాగంగానే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హత్యకు ప్లాన్ చేసినట్లు యూఎస్ ఇంటలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ అలర్ట్ చేయడంతో వెంటనే ట్రంప్‌ సెక్యూరిటీని టైట్ చేశారు.

ఇదిలా ఉంటే, ట్రంప్‌పై హత్యాయత్నం వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు కూడా వరల్డ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య గత ఏడాదిన్నరగా భీకర యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో స్నేహపూర్వక సంబంధాలను కంటిన్యూ చేస్తున్నాడు. నవంబర్‌లో జరిగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ట్రంప్ గెలిచి ఛాన్స్ ఉందని అమెరికాలోని మెజార్టీ సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. రష్యాతో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే తమకు అగ్రరాజ్యం మద్దతు కరువు అవుతోందని భావించి.. ట్రంప్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story