US Elections: కమలా హారిస్ గెలవాలని ట్రంప్ భార్య కోరుకుంటున్నారు.. వైట్‌హౌస్ మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన

by Maddikunta Saikiran |
US Elections: కమలా హారిస్ గెలవాలని ట్రంప్ భార్య కోరుకుంటున్నారు.. వైట్‌హౌస్ మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా,ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వీరిద్దరూ తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీలలో ఆయన భార్య మెలానియా ట్రంప్ పాల్గొనకపోవడంపై కొన్ని మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై వైట్‌హౌస్ మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కారాముచి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల మీడియాస్ టచ్ పోడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో స్కారాముచి మాట్లాడూతూ.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తన భర్తకు కాకుండా కమలా హారిస్‌కి రహస్యంగా మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.కమలా హారిస్ గెలవడం పట్ల మెలానియా ట్రంప్ చాలా ఆసక్తిగా ఉన్నారని స్కారాముచి చెప్పారు. మెలానియా డొనాల్డ్ ట్రంప్‌ని ద్వేషిస్తున్నదని, తన భార్య కూడా డొనాల్డ్ ట్రంప్‌ని ద్వేషిస్తుందని వెల్లడించారు. మెలానియా, డొనాల్డ్ ట్రంప్ కన్నా కమలా హారిస్ విజయం పట్ల మరింత ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.

స్కారాముచి ఆరోపణలను ఖండించిన ట్రంప్..

ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ తనపై, తన భార్య మెలానియా ట్రంప్‌పై స్కారాముచి చేసిన ఆరోపణలను కొట్టి పడేశారు.నా హయాంలో అతన్ని విధుల నుంచి తప్పించినందుకే అతను తనపై కోపం పెంచుకున్నాడని, అందువల్లే ఈ ఆరోపణలు చేశాడని ట్రంప్ వెల్లడించారు. మెలానియా ట్రంప్ లో ప్రొఫైల్ కోరుకుంటున్నారని, అలాగే తన కొడుకు బ్యారన్ ట్రంప్ కాలేజీ ఎడ్యుకేషన్‌లో ఆమె బిజీ ఉన్నారు. అందుకే ఆమె ఎక్కువగా న్యూయార్క్‌ లోనే ఉండడం వల్ల తన ర్యాలీలకు హాజరుకాలేదని తెలిపారు. అయితే మెలానియా ట్రంప్ ఎన్నికలకు ముందు కొన్ని నిధుల సేకరణ కార్యక్రమాలకు హాజరు అయ్యారు,అలాగే ట్రంప్‌పై పెన్సుల్వేనియా రాష్ట్రంలో హత్యాయత్నం జరిగిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఆంథోనీ స్కారాముచి ఎవరు..?

ఆంథోనీ స్కారాముచి, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2017లో జూలై 21 నుండి జూలై 31 వరకు కేవలం పదకొండు రోజుల పాటు వైట్ హౌస్‌లోని అన్ని కమ్యూనికేషన్‌లకు బాధ్యత వహించాడు.స్కారాముచి నియామకం మరుసటి రోజే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తన పదవికి రాజీనామా చేశారు .ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రకారం స్కారాముచిని కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా నియమించడంపై Mr. స్పైసర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. దీంతో డొనాల్డ్ ట్రంప్ స్కారాముచిని తన పదవి నుంచి తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed