- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Assembly Sessions ప్రారంభం... కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్(State Annual Budget) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కాసేపట్లో అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(AP Deputy CM, Panchayat Raj Minister Pawan Kalyan) కీలక బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లు-2024(Panchayati Raj Bill-2024)ను పెట్టేందుకు పవన్ కల్యాణ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024(AP Government Employees Bill-2024)ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సన్నాహాలు పూర్తి చేశారు. అ
సెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 22 వరకు సమావేశాలు కొనసాగించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(Assembly Business Advisory Committee) నిర్ణయించింది. అయితే ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు జరిపినప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు(Chintakayala Ayyannapatrudu) నిర్ణయించారు. మొత్తం సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేసింది.