తైవాన్‌కు యూఎస్ అభినందనలు: తీవ్రంగా ఖండించిన చైనా

by samatah |
తైవాన్‌కు యూఎస్ అభినందనలు: తీవ్రంగా ఖండించిన చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్‌లో ఇటీవల ఎన్నికలు జరగగా డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లై చింగ్-తే విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా తైవాన్ ప్రజలకు శనివారం అభినందనలు తెలిపింది. తాజాగా దీనిపై చైనా స్పందించింది. యూఎస్ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. యూఎస్ ప్రకటన తైవాన్ ప్రజలకు తప్పుడు సంకేతాన్ని పంపుతుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తైవాన్ తో పరస్పర అధికారిక చర్యలను నిలిపివేయాలని కోరారు. వేర్పాటు వాద శక్తులకు తప్పుడు సంకేతాలను పంపడం సరికాదన్నారు. చైనా సూత్రాలను అమెరికా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed