సిరియా, ఇరాక్‌లపై అమెరికా దాడి: ఇరాన్ స్థావరాలే లక్ష్యం

by samatah |
సిరియా, ఇరాక్‌లపై అమెరికా దాడి: ఇరాన్ స్థావరాలే లక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాక్, సిరియాలోని ఇరాన్ స్థావరాలపై అమెరికా శనివారం క్షిపణి దాడులు చేసింది. సుమారు 7 చోట్ల 85 ఇరాన్ స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేసినట్టు యూఎస్ ఆర్మీ తెలిపింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ స్టోరేజీ సైట్లతో పాటు ఇంటెలిజెన్స్ స్థావరాలపై దాడులు జరిగాయి. అయితే సుమారు 30 నిమిషాల పాటు దాడులు కొనసాగగా..అందులో ఎంత మంది మరణించారనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ ప్రాణనష్టం భారీగానే జరిగి ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. కాగా, జోర్డాన్-సిరియా సరిహద్దులోని రిమోట్ బేస్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇటీవల డ్రోన్ దాడి చేయగా ముగ్గురు యూఎస్ సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది.

యూఎస్‌కు హానిచేస్తే ఊరుకోము: జో బైడెన్

‘అమెరికన్ సైనిక దళాలు ఇరాక్, సిరియాలోని స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాలు అమెరికన్ దళాలపై దాడి చేశాయి. దానికి ప్రతి స్పందించడం ప్రారంభించాం. ఇది ఇలాగే కొనసాగుతుంది’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడ కూడా సంఘర్షణ జరగాలని యూఎస్ కోరుకోదు. కానీ మాకు హానీ చేయాలని చూస్తే ఊరుకోము. దానికి ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించారు. అలాగే యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed