ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ISIS)పై అమెరికా,ఇరాక్ దళాల వైమానిక దాడి.. 15 మంది ISIS ఉగ్రవాదులు హతం..!

by Maddikunta Saikiran |
ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ISIS)పై అమెరికా,ఇరాక్ దళాల వైమానిక దాడి.. 15 మంది ISIS ఉగ్రవాదులు హతం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాక్ దేశంలోని అన్బర్ ఎడారిలో అమెరికా,ఇరాక్ దళాలు సంయుక్తంగా కలిసి ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ISIS)పై భీకరమైన వైమానిక దాడులు చేశాయి.ఈ దాడిలో 15 మంది ISIS మిలిటెంట్లు మరణించినట్లు US కు చెందిన సెంట్రల్ కమాండ్(CENTCOM) శుక్రవారం వెల్లడించింది.కాగా చనిపోయిన వారిలో కీలకమైన ISIS నాయకులు ఉన్నారని ఇరాక్ సైన్యం ప్రకటించింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేశామని CENTCOM తన సోషల్ మీడియా ప్లాట్ ఫారం X వేదికగా వెల్లడించింది.కాగా ఈ దాడిలో ఏడుగురు అమెరికన్ సైనికులు గాయపడ్డారని అమెరికా రక్షణ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.

ISIS తమ బలగాలను ఇరాక్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాక్ ఇది వరకే ప్రకటించింది. కానీ వారు తమ బలగాలను ఉపసంహరించుకోలేదు. దీంతో US బలగాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ గ్రూపుపై దాడులు చేయాలనీ ఇరాక్ దళాలు నిర్ణయించుకున్నాయి. ఇరాక్, సిరియాలో ఉన్న ISIS యొక్క రహస్య స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా ఈ రెండు దేశాల దళాలు కలిసి డజన్ల కొద్దీ డ్రోన్లు, రాకెట్లతో వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో ISISకు చెందిన అనేకమైన ఆయుధాలు, ముఖ్యమైన పత్రాలు, కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed