సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు

by Harish |
సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు
X

బీరుట్: సిరియాలో అమెరికా గగనతల దాడులతో రెచ్చిపోయింది. అమెరికన్ కాంట్రాక్టర్ హత్యకు కారణమనే నెపంతో జరిపిన దాడుల్లో 8 మంది మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అంతకుముందు డ్రోన్ దాడిలో యూఎస్ కాంట్రాక్టర్ మృతితో పాటు ఐదుగురు గాయపడటంతో ప్రతీకార దాడులకు పాల్పడినట్లు శుక్రవారం తెలిపాయి. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ‘ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధంగా ఉన్న సమూహాలపై దాడులకు దిగినట్లు రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్’ తెలిపారు.

ఈశాన్య సిరియాలోని హసాకే సమీపంలోని సంకీర్ణ స్థావరంపై మానవరహిత వైమానిక వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒక యూఎస్ కాంట్రాక్టర్ మరణించగా, ఐదుగురు గాయపడ్డారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటనలో తెలిపింది. ఆయుధ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్న దాడిలో ఎనిమిది మంది హతమైనట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ హెడ్ రమీ అబ్దుల్ రెహ్మన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed