- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్‌లో ప్రతి సెకనుకు ఒక చిన్నారి ఇలా అవుతున్నారు..?!! UN తాజా నివేదిక
దిశ, వెబ్‌డెస్క్ః ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 1.4 మిలియన్ల మంది పిల్లలు ఉక్రెయిన్ నుండి వెళ్లిపోయినట్లు తాజా నివేదికలు వెళ్లడిస్తున్నాయి. దీన్ని బట్టి ఉక్రెయిన్ నుండి ప్రతి సెకనుకు దాదాపుగా ఒక చిన్నారి శరణార్థిగా మారినట్లు ఐక్యరాజ్య సమితి మంగళవారం తెలిపింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) నుండి వచ్చిన తాజా లెక్కలను బట్టి ఒక్క మంగళవారం రోజునే ఉక్రెయిన్ నుండి మూడు మిలియన్లకు పైగా ప్రజలు పారిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు సగం మంది పిల్లలే కావడం గమనార్హం.
గత 20 రోజులుగా ఉక్రెయిన్‌లో సగటున ప్రతిరోజూ 70,000 మందికి పైగా పిల్లలు శరణార్థులుగా మారుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల ఏజెన్సీ UNICEF ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ఇటీవల జెనీవాలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీన్ని బట్టి ప్రతి నిమిషానికి 55 మంది చిన్నారులు శరణార్థులుగా మారుతున్నట్లు తెలుస్తుంది. ఇక, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్కేల్ పరంగా, ఇంతటి వేగంగా ఇలాంటి సంక్షోభం ఏర్పడటం ఇదే తొలిసారని జేమ్స్ ఈ సందర్భంగా వెల్లడించారు. యుద్ధం కారణంగా వారి దేశం నుండి పారిపోయిన పిల్లలు సరిహద్దు దేశాలకు వచ్చిన తర్వాత కుటుంబ విభజన, హింస, లైంగిక దోపిడీ, మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. "అలాంటి వారికి భద్రత, స్థిరమైన సంరక్షణా సేవలు చాలా అవసరం" అని జేమ్స్ ఇక్కడ ప్రస్తావించాడు.