- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి నిధులు ఇవ్వండి: UN చీఫ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాడులు మొదలైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(UNRWA) ఉద్యోగులు అక్కడి శరణార్థులకు సహాయం చేస్తున్నారు. అయితే ఈ సహాయ కార్యక్రమాలను కొనసాగించడానికి తమ వద్ద నిధులు లేవని తాజాగా UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. సెప్టెంబర్ వరకు కార్యకలాపాలను కొనసాగించడానికి తగినంత నిధులు ఉన్నాయని, ఆ తర్వాత అవసరం అయ్యే నిధులు మా వద్ద లేవని దాతలు తమకు సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ లేకపోతే పాలస్తీనియన్లు మరింత క్షిష్టమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. స్థానికులు భయంకరమైన నరకంలోకి నెట్టివేయబడుతారు. దాతలు ఏజెన్సీకి నిధులు సమకూర్చాలని UN చీఫ్ వేడుకున్నారు. అమెరికా కాంగ్రెస్ నుంచి యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏకి నిధుల కేటాయింపులు ఆగిపోయాయి. ప్రెసిడెంట్ జో బైడెన్ పాలస్తీనియన్ పౌరులకు ఇతర సంస్థలకు నిధులు అందించాలని ఆదేశించారు. దీంతో నిధుల కోసం UN ఏజెన్సీ ఇతర దాతలపై ఆధారపడాల్సి వచ్చింది. గుటెర్రెస్ పేర్కొన్న దాని ప్రకారం, యుద్ధంలో 195 మంది యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ సిబ్బంది మరణించారు, ఇది ఐక్యరాజ్యసమితి చరిత్రలో సిబ్బంది మరణాల సంఖ్య పరంగా అత్యధికం.