ఉక్రెయిన్ షెల్ట‌ర్ హోమ్స్‌లో మ‌న‌సు చ‌లించే సంగీత సాగా..!

by Sumithra |   ( Updated:2022-03-08 08:02:35.0  )
ఉక్రెయిన్ షెల్ట‌ర్ హోమ్స్‌లో మ‌న‌సు చ‌లించే సంగీత సాగా..!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఫిబ్రవరి 24న రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై దండెత్తినప్పటి నుండి అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య బ‌తుకుతున్నారు. చుట్టూ బాంబుల వ‌ర్షం, బిగ్గ‌ర‌గా పేలుళ్ల‌ మోత‌లు, క్షిపణి దాడులు... అయినా, ఎక్క‌డో ఆశ‌. యుద్ధం ముగిసి, తిరిగి మ‌న ఇళ్ల‌కు చేరుకుంటామ‌ని, కుటుంబాల‌తో క‌లిసి సాధార‌ణ జీవితం గ‌డ‌పుతామ‌న్న విశ్వాసం వారిని తాజా వ‌త్తిడి నుంచి త‌ట్టుకునేట‌ట్లు చేస్తోంది. ప్రజలు మెట్రో స్టేషన్లలో, బాంబు షెల్టర్లలో, బంక‌ర్ల కింద త‌ల‌దాచుకుంటున్నారు. వారంతా ఈ క‌ర్క‌శ కాలాన్ని ఎదుర్కోడానికి ఓ శక్తివంతమైన ఆయుధంగా సంగీతాన్ని ఎంచుకున్నారు. ఒక‌రితో ఒక‌రు మ్యూజిక్‌తో మూగ‌గా సంభాషించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇందులో ఉక్రేనియన్ యువ‌తి బాంబు షెల్టర్‌లలో వయోలిన్ వాయిస్తూ కనిపిస్తుంది. మ‌రో చిన్నారి `పోతే పోనీ..` అనే పాట‌తో అల‌రిస్తుంది.

వ‌యోలిన్ వాయించే వీడియోను ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MFA) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మైకోలా లైసెంకో స్వ‌ర‌ప‌ర‌చిన నిచ్ యాకా మిసియాచ్నా ( ఏలాంటి మూన్‌లైట్ నైట్‌) అనే ట్యూన్‌ను ప్లే చేస్తున్న ఈ వీడియో నెట్టింట్లో గుండెను పిండేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను "హాంటింగ్లీ బ్యూటిఫుల్" అని పిలుస్తున్నారు. ఇక‌, చిన్నారి పాడిన పాట‌ 12 మిలియ‌న్ల వ్యూవ్స్ అందుకుంది. ఉక్రెయిన్ చిన్నారి పాట‌ను వింటూ బంక‌ర్లో ఉన్నవారంతా క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు.


Advertisement

Next Story

Most Viewed