- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెక్కి వెక్కి ఏడుస్తున్న ఉక్రెయిన్ బాలుడు..?! కంటతడి పెట్టించే వీడియో
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీసింది. అటు తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు అంతకుమించిన ప్రాణ నష్టం కలిగించింది. మరోవైపు లక్షలాది మంది ఉక్రెయిన్లను దిక్కులేక దేశం విడిచి వెళ్లిపోయేటట్లు చేసింది. ఇప్పటికి సుమారు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సరిహద్దు దాటారు. సొంత ఇల్లు బాంబులకు బలౌతుంటే, కట్టుకోడానికి బట్టలు మాత్రమే పెట్టుకొని, బతుకు జీవుడా అంటూ బయలుదేరారు. సరిగ్గా, ఈ తరుణంలో ఎన్నో సజీవ సాక్ష్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెట్టాయి, కన్నీళ్ల పర్యంతమయ్యేలా చేశాయి. అందులో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉక్రెయిన్ నగరం క్రెమ్లిన్‌లో కొనసాగుతున్న దాడి కారణంగా, ఉక్రెయిన్ నుండి పోలాండ్‌లోని మెడికా అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక బాలుడు ఏడుస్తూ, చేతిలో ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ని లాక్కుంటూ వెళ్లే దృశ్యం ఎంతో హృదయ విదారకంగా కనిపించింది. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించిన ఈ వీడియోలో చిన్న పిల్లాడు తన వీపుపై రక్‌సాక్ తగిలించుకొని, ఆడుకునే బొమ్మ ఉన్న ఓ క్యారీబ్యాగ్‌ను ఈడుస్తూ, ఏడుస్తుండటం చూసి మనసున్న ఎవరికైనా గుండె చమ్మగిల్లుతుంది. అయితే, పోలిష్ సరిహద్దును దాటుతున్న క్రమంలో బాలుడు తన తల్లి వెనుక నడుస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ వీడియోకు 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ రాగా, వేలల్లో రీట్వీట్‌లు, కామెంట్లు వస్తున్నాయి.
Excruciating pic.twitter.com/PIutGEIN0F
— Josh Campbell (@joshscampbell) March 7, 2022