- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hamas :ఇస్మాయిల్ హనియే హత్యపై తుర్కియే సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో జరిగిన దాడిలో ‘హమాస్’ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతిపై తుర్కియే స్పందించింది. హనియేపై జరిగిన దాడి ఘటనను తుర్కియే విదేశాంగ శాఖ ఖండించింది. హనియే లాంటి కీలక నేతను కోల్పోయినందుకు పాలస్తీనా ప్రజలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ‘‘పాలస్తీనా స్వతంత్ర దేశం కోసం ఇజ్రాయెల్‌తో చేస్తున్న సుదీర్ఘ పోరాటంలో ఇప్పటివరకు హనియే వంటి వేలాది మంది యోధులు అమరులయ్యారు’’ అని తుర్కియే గుర్తు చేసింది. ఈమేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.
పాలస్తీనాలోని గాజా ప్రాంతం కేంద్రంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తుర్కియే విదేశాంగ శాఖ ఆరోపించింది. పాలస్తీనా ప్రజల "న్యాయమైన కారణానికి" తమ దేశం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా నడుమ శాంతి సయోధ్య కుదరాలనే ఉద్దేశం నెతన్యాహు ప్రభుత్వానికి లేదని మరోసారి తేలిపోయిందని తుర్కియే వ్యాఖ్యానించింది. కాగా, ఇస్మాయిల్ హనియే మృతిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.