బ్రేకింగ్ న్యూస్.. 34,000 దాటిన టర్కీ భూకంపం మృతుల సంఖ్య

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. 34,000 దాటిన టర్కీ భూకంపం మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: టర్కీ, సిరియాలో.. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఎనిమిది రోజుల నుంచి సహాయక చర్యలు జరుగున్నాకొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం టర్కీ, సిరియా ప్రాంతాల్లో ఈ భారీ భూకంపం కారణంగా ఇప్పటి వరకు..34,179 మృతి చెందారు. ఈ మృతుల సంఖ్య కేవలం ఒక్క టర్కీలోనే 29,605 మరణాలు నమోదు కాగా.. సిరియాలో 4,574 మంది మృతి చెందినట్లు.. సాల్వేషన్ గవర్నమెంట్ గవర్నెన్స్ అథారిటీ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా ఫిబ్రవరి 6 సోమవారం మొదట భూకంపం సంభవించింది. దీని తర్వాత రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మొత్తం 5 సార్లు భూ కంపించడంతో ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. భూకంపానికి తోడు.. తీవ్రమై వర్షపాతం.. అలాగే ఎముకలు కొరికే చలి టర్కీ, సిరియా ప్రజలను మృత్యుఒడిలోకి లాగాయి. ఈ క్రమంలో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతుండగా.. ఈ రోజు తెల్లవారుజామున(ఫిబ్రవరి 13న) మరోసారి భూకంపం సంభవించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7 గా నమోదయింది.

Advertisement

Next Story

Most Viewed