- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టర్కీ భూకంపం.. 28 వేల మంది మృతి..
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 6న టర్కీ, సిరియా సంబవించిన భూకంపం కారణంగా.. మరణాల సంఖ్య 28 వేలకు చేరుకుంది. భారీ భూకంపం కారణంగా.. టర్కీలో 24,617 మంది మృతి చెందినట్లు టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓక్టే మీడియాతో అన్నారు. అలాగే.. , సిరియాలో, మొత్తం 3,575 మృతి చెందినట్లు వైట్ హెల్మెట్స్ సివిల్ డిఫెన్స్ వారు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఈ భారీ భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 28,192కి చేరుకున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ భారీ భూకంపం టర్కీ, సిరియా భూబాగాన్ని తీవ్రంగా కంపించడంతో కొన్ని ప్రధాన నగరాలు, నేలమట్టం అయ్యాయి. దీంతో వేల మంది ప్రజలు భవనాల శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. అలాగే వేల సంఖ్యలో ప్రజలు ఇంకా భారీ భవనాల శిథిలాల కిందనే చిక్కుకుని.. ఆకలి.. దాహంతో సహాయ చర్యల కోసం కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ క్రమంలో నిన్న భారత ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఒ 17 ఏళ్ల యువకుడిని భారీ భవన శిథిలాల నుంచి బయటకు తీశారు. ఆ యువకుడు దాహం నుంచి కాపాడుకోవడానికి తన మూత్రం తానే తాగినట్లు.. తెలిపాడు. అయితే ఇంకా వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలి ఉండటంతో మృతుల సంఖ్య 30 వేలకు పైగా దాటే అవకాశం ఉన్నట్లు రక్షణ చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలుపుతున్నారు.