రష్యాకు వెళ్లనున్న చైనా దౌత్యవేత్త

by Javid Pasha |
రష్యాకు వెళ్లనున్న చైనా దౌత్యవేత్త
X

మాస్కో/బీజింగ్: ఉక్రెయిన్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యీ మాస్కో పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. రష్యాతో సంబంధం విషయంలో దూరంగా ఉండాలని అమెరికాకు బీజింగ్ చెప్పింది. చైనా బెలూన్లు అమెరికాలో కనిపించడం, వాటిని పేల్చివేయడం వంటి సంఘటన తర్వాత వాషింగ్టన్, బీజింగ్ మధ్య దూరం పెరిగింది. మాస్కోకు చైనా ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపించింది.

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యాతో చర్చించాలని చైనా భావిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఐరోపా సంఘర్షణలకు గురైంది. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మాస్కో, పశ్చిమ దేశాల మధ్య ఇదే అతిపెద్ద ఘర్షణ. చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యీ మాస్కోకు రానున్నట్టు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ ధ్రువీకరించారు. అయితే వాంగ్ యీ ఎప్పుడు వస్తారనేది చెప్పలేదు. 'అధ్యక్షుడు పుతిన్‌తో వాంగ్ యీ సమావేశాన్ని మేము తరస్కరించలేం. ఎజెండా స్పష్టంగా ఉంది. విస్తృతమైన చర్చలు జరుగుతాయి' అని పెస్కోవ్ అన్నారు.


Advertisement

Next Story