Air India: ఎయిర్ ఇండియా విమానంలో మరుగుదొడ్ల సమస్య! ప్రయాణికుల ఆందోళన

by Ramesh N |
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మరుగుదొడ్ల సమస్య! ప్రయాణికుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ ఇండియా (Air India flight) విమానంలో మరుగుదొడ్ల (toilets) సమస్య ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా విమానం 216 అమెరికాలోని చికాగో నుంచి ఇండియాకు మార్చి 6న బయలుదేరింది. విమానంలో ఉన్న 12 టాయిలెట్లలో 11 టాయిలెట్లు పని చేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. విమానంలో 300 మందికి పైగా ప్రయాణికులకు ఒకే ఒక టాయిలెట్ మిగిలి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రయాణికుల ఆందోళనతో చేసేదేమీ లేక విమానం వెనక్కి మళ్లించారు. దాదాపు ఐదు గంటలు గాల్లో.. తిరిగి చికాగో విమానాశ్రయానికి ఫ్లైట్ రావడానికి పది గంటల పాటు ప్రయాణికులు చుక్కలు చూసినట్లు ఆరోపణలు వచ్చాయి. మళ్లీ చికాగోలో దిగిన ప్రయాణికులకు వసతులు కల్పించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story