మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..

by Mahesh |   ( Updated:2022-11-26 03:20:17.0  )
మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్ లో మరో సారి కాల్పుల కలకలం సృష్టించింది. బ్రెజిల్ లోని ఎస్సిరిటో శాంటో రాష్ట్రంలోని అర క్రూజ్ అనే చిన్న పట్టణంలో ఒకె వీధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల, ఓ ప్రవేట్ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మందికి బుల్లెట్లు తగిలి గాయాలు అయ్యాయి. కాల్పులకు పాల్పడిన దుండగుడిని 16 ఎళ్ల మైనర్ గా పోలీసులు గుర్తించారు. అలాగే అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు జరుపుతున్నప్పుడు అక్కడే ఉన్న సీసీటీవీలో అంతా రికార్డు అయింది. ఆ ఫుటేజ్ లో.. దుండగుడు బుల్లెట్‌ప్రూఫ్ చొక్కా ధరించి, సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను ఉపయోగించి దాడులకు పాల్పడినట్లు కనిపంచింది.

Advertisement

Next Story

Most Viewed