London : స్వచ్ఛ జలాల కోసం లండన్‌లో నిరసన గళం

by Hajipasha |   ( Updated:2024-11-03 18:52:27.0  )
London : స్వచ్ఛ జలాల కోసం లండన్‌లో నిరసన గళం
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటన్ రాజధాని లండన్‌(London)లో వేలాది మంది ప్రజలు స్వచ్ఛ జలం కోసం రోడ్లపైకి వచ్చి గళం వినిపించారు. పలు పర్యావరణ పరిరక్షణ సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 15వేల మందికిపైగా ప్రజలు ప్లకార్డులు చేతపట్టి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని నదులు, సముద్రాల్లోని జలాలను(Water Pollution) శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. లండన్ పరిధిలో నీటి వ్యాపారం చేసే కంపెనీలు కాలుష్య నియంత్రణ చట్టాలను తు.చ తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇంగ్లండ్‌ పరిధిలో జల పరిరక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ‘వాటర్ సర్వీసెస్ రెగ్యులేషన్ అథారిటీ’ పనితీరును సమీక్షించాలన్నారు. ఈ నిరసనల్లో ప్రముఖ సింగర్, పర్యావరణ ఉద్యమకారుడు ఫేర్గల్ షార్కీ, అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్, గ్రీన్ పీస్, వైల్డ్ లైఫ్ ట్రస్ట్స్, బ్రిటీష్ రోయింగ్ వంటి స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed