- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళపై 72 మంది రేప్.. ఆ వీడియోలు ప్రజలు చూసేందుకు కోర్టు పర్మిషన్
దిశ, వెబ్ డెస్క్: మహిళపై 72 మంది రేప్ చేసిన కేసు ఆ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచంలోనే సంచలనం రేపింది. స్వయంగా భర్తే ఆమెకు మత్తుమందు ఇచ్చి.. పలువురు వ్యక్తులతో అత్యాచారం చేయించిన ఘటన ఫ్రాన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో న్యాయమూర్తి సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. బాధితురాలిపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియో ఆధారాలను కోర్టులో ప్రదర్శించే సమయంలో.. కోర్టు ఆవరణలో ఉన్న సాధారణ ప్రజలు కూడా వాటిని చూడవచ్చని చెప్పారు. సున్నితమైన మనసు ఉన్నవారు, మైనర్లు మాత్రం కోర్టు పరిసరాల్లో లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలిపై జరిగిన దారుణానికి సంబంధించిన నిజాలను వెలికి తీసే క్రమంలో అవసరమైతేనే వీడియోలను ప్రదర్శిస్తామని జడ్జి పేర్కొన్నారు.
ఇదీ కేసు..
ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే 71 ఏళ్ల వ్యక్తి.. తన భార్యపై పదేళ్లపాటు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. రాత్రివేళ ఆమె తినే ఆహారంలో డ్రగ్స్ కలిపి ఇచ్చి.. తినిపించేవాడు. భర్త తనపై ఎంతో ప్రేమను చూపిస్తున్నాడనుకున్న ఆమె.. చివరికి మోసపోయింది. ఆమె మత్తులోకి జారుకున్నాక.. కొందరు వ్యక్తుల్ని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయించాడు ఆ దుర్మార్గుడు. వాటిని తానే సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేశాడు. 2011 నుంచి 2020 వరకూ ఇదే తంతు కొనసాగింది. ఓ షాపింగ్ సెంటర్లో ఇతర మహిళలను సీక్రెట్ గా వీడియోలు తీస్తుండగా సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులు అప్పగించడంతో వాడి దుర్మార్గం బయటపడింది.
ఫోన్, ల్యాప్ టాప్ ను చూసిన పోలీసులు షాకయ్యారు. వందలకొద్దీ ఫొటోలు, వీడియోలను చూసి ఖంగుతిన్నారు. 72 మంది పురుషులతో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు గుర్తించారు. వారందరి వయస్సు 26-73 ఏళ్ల మధ్యలో ఉంటుందని, ఇంకా 51 మంది వివరాలు తెలియరాలేదన్నారు. భవిష్యత్తులో తనతో పాటు ఏ మహిళకు ఇలాంటివి జరగకుండా ఉండాలని కేసును బహిరంగంగానే విచారించాలని బాధితురాలే స్వయంగా కోరింది.