ఆ నిర్ణయం ఉగ్రవాదానికి బహుమతి ఇవ్వడమే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

by samatah |
ఆ నిర్ణయం ఉగ్రవాదానికి బహుమతి ఇవ్వడమే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు అధికారికంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ మూడు దేశాలు తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదానికి బహుమతి ఇవ్వడం లాంటిదేనని అభివర్ణించారు.ఈ డెసిషన్‌ను తీవ్రంగా ఖండిస్తు్న్నట్టు చెప్పారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం వల్ల ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న చేసిన దాడిని పునరావృతం చేసేందుకు హమాస్‌ను పురికొల్పుతుందని పేర్కొన్నారు. గతేడాది హమాస్ దాడికి వెస్ట్ బ్యాంక్‌లోని 80 శాతం మంది పాలస్తీనియన్లు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఈ నిర్ణయం శాంతిని నెలకొల్పబోదని, హమాస్‌ను ఓడించకుండా ఆపలేదని స్పష్టం చేశారు.

మరోవైపు, రఫా, గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైనిక చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా.. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తూ నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించింది. ఇరు దేశాల పరిష్కారానికి మద్దతు ఇచ్చిన వాషింగ్టన్.. చర్చల ద్వారా మాత్రమే అటువంటివి చేయాలని తెలిపింది. వ్యూహాత్మక నిర్ణయం కారణంగా వెస్ట్ బ్యాంక్ అస్థిరత చెందుతుందని యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ హెచ్చరించారు. పాలస్తీనా భూభాగానికి నిరంతరాయంగా నిధులు రావాలని పిలుపునిచ్చారు.

కాగా, నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ లు పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా గుర్తింపును ప్రకటించాయి. ఈ దేశాలు వచ్చే వారం పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ ఈ ఐరోపా దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించుకుంది. అలాగే అమెరికా కూడా ఈ మూడు దేశాల రాయబారులను వెనక్కి పిలిచింది. పాలస్తీనాను గుర్తించాలనే నిర్ణయం గాజా నుండి బందీలను తిరిగి తీసుకురావడానికి మరియు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రయత్నాలకు హాని కలిగించొచ్చని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.

Advertisement

Next Story