స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో టెస్లా మొబైల్ రిలీజ్..!

by Satheesh |
స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో టెస్లా మొబైల్ రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ రిచెస్ట్ మేన్, టెస్లా, స్టార్ లింక్, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలన్ మస్క్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలకే టెస్లా కార్లను అందుబాటులోకి తెచ్చిన మస్క్ అదే స్టైల్‌లో లో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలన్ మస్క్‌కే చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో టెస్లా స్మార్ట్ ఫోన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మస్క్ పేరుతో ఉన్న ఓ అకౌంట్‌లో టెస్లా స్మార్ట్ ఫోన్ పిక్ పోస్ట్ చేసి ‘మీరు టెస్లా స్మార్ట్‌ఫోన్ కొంటారా..? మీ సమాచారం ఎప్పటికీ సేకరించబడదు’’ అని ట్వీట్ చేశారు.

ఈ ఫొటోలో మొబైల్ మోడల్ నేమ్, ఫీచర్స్ వెల్లడించనప్పటికీ లుకింగ్ మాత్రం అదిరిపోయింది. డ్యుయెల్ కెమెరాతో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ ఉన్నట్లు ఫొటో చూస్తే అర్థమవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. టెస్లా నిజంగానే మొబైల్ లాంఛ్ చేసిందా..? ధర ఎంత..? ఫోన్ మోడల్, ఫీచర్స్ ఏంటీ..? అంటూ కొందరు నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నలు అడుతుండగా మరి కొందరు మాత్రం ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు. మరీ నిజంగా టెస్లా స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిందా లేదా అన్న దానిపై మస్క్ కానీ టెస్లా కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.



Next Story