floods: కురుస్తున్న కుండపోత వర్షాలు.. పదుల సంఖ్యలో మృతి

by Indraja |
floods: కురుస్తున్న కుండపోత వర్షాలు.. పదుల సంఖ్యలో మృతి
X

దిశ వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గల్ఫ్‌ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి వరదలు విలయతాండవం చేస్తున్నాయి. తాజాగా ఒమన్‌లో వరద ధాటికి 18 మంది మృతి చెందారు. అనేక భవనాలు నేలకొరిగాయి. అలానే రోడ్లు జలమయమై రాకపోకలు స్తంభించాయి. ఇక దుబాయ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

వేగంగా వీస్తున్న ఈదురు గాలులకు కుర్చీలు, టేబుళ్లు సైతం ఎగిరిపోతున్నాయి. దీనితో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అలానే ఎయిర్‌పోర్టులు జలమయమై విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక బహ్రెయిన్. ఖతర్, సౌదీ అరేబియా లోనూ ఇదే పరిస్థి నెలకొంది. దీనితో ప్రజలు బయటకు రావాలంటేనే బయపడిపోతున్నారు.

వరద ఉధృతి కారణంగా రోడ్డు మార్గాలన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇతర దేశాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన వారు సొంత దేశాలకు వెళ్ళాలి అనుకున్న విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story