హాగ్ రూ.11... ముద్దు రూ.110... దుమారం రేపుతున్న 'స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్' ట్రెండ్

by M.Rajitha |
హాగ్ రూ.11... ముద్దు రూ.110... దుమారం రేపుతున్న స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : చాలామంది సింగిల్స్ తోడు లేదని ఫీల్ అవుతుంటారు. ఇలా గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలయ్యే సింగిల్స్.. ముఖ్యంగా అబ్బాయిల కోసం ఓ విచిత్రమైన బంపర్ ఆఫర్ నెట్టింట్లో సంచలనం పుట్టిస్తోంది. ఏంటా విచిత్రమైన బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? అద్దెకు గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. చైనా లోని షెంజెన్ నగరంలో 'లవ్ మి ఇఫ్ యూ కెన్' అనే పేరుతో అక్కడి కొంతమంది అమ్మాయిలు 'స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్' అంటూ స్టాల్స్ ఏర్పాటు చేశారట. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ కోసం చార్జ్ చేస్తారు. హాగ్ అయితే రూ.11, ముద్దు అయితే రూ.110, ఇంటికి తీసుకువెళ్ళి మందు తాగాలి అంటే గంటకు రూ.400 ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినడానికి కాస్త వింతగానే ఉన్నా.. ఈ స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. మా దేశంలో కూడ ఇలాంటి ట్రెండ్ ఉంటే బాగుండు అని వివిధ దేశాల్లోని సింగిల్స్ వాపోతుంటే... పెద్దవాళ్ళు మాత్రం ఇదెక్కడి వింత పోకడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

Next Story

Most Viewed