ఆగిన భారత్, కెనడా వాణిజ్య ఒప్పందం

by Shiva |   ( Updated:2023-09-16 17:44:36.0  )
ఆగిన భారత్, కెనడా వాణిజ్య ఒప్పందం
X

న్యూ ఢిల్లీ : కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆ దేశంతో భారత్ కు దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నిలచిపోయాయి. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను తిరిగి ప్రారంభిస్తామని భారత్‌ స్పష్టం చేసింది. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాకు వెల్లడించారు. మరోవైపు కెనడా కూడా దీనిపై స్పందించింది.

భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేశామని ఆ దేశ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ ప్రకటించారు. ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలను చూసీచూడనట్లుగా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సారథ్యంలోని కెనడా ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని భారత్ వాదిస్తోంది. ఇటీవల జీ 20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన ట్రూడోతో ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీకి నేరుగా తెలిపారు. భారత్‌ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నాయని, అవి కెనడాకు కూడా ముప్పుగా మారుతాయని హెచ్చరించారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed