తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక: రణిల్ విక్రమసింఘే కీలక విజ్ఞప్తి

by samatah |
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక: రణిల్ విక్రమసింఘే కీలక విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి దివాళా తీసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులను ఐదేళ్ల వరకు వాయిదా వేయాలని రుణ దాతలకు అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే విజ్ఞప్తి చేశారు. 2028 వరకు విదేశీ రుణ చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని కోరనున్నట్టు తెలిపారు. బుధవారం శ్రీలంక పార్లమెంటులో ఆయన మాట్లాడారు. బిలియన్ల డాలర్ల రుణాలు, బాండ్ల పునర్నిర్మాణానికి ద్వైపాక్షిక చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. శ్రీలంక చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం తర్వాత, దేశం రుణ పునర్: నిర్మాణానికి దగ్గరగా ఉందని వెల్లడించారు. డిసెంబరు 2027 చివరి వరకు అప్పులను తీర్చకుండా తాత్కాలిక ఉపశమనం పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, 2022లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 2022లో విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 2023 నాటికి శ్రీలంక విదేశీ రుణం USD 52.65 బిలియన్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా చైనాకు చెల్లించాల్సి ఉంది. అయితే విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టి తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించడంలో సఫలమయ్యారు. అంతేగాక నిత్యావసరాల కొరత చాలా వరకు తగ్గింది. శ్రీలంక కరెన్సీ బలపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed