Sheikh Hasina : అమెరికాపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

by Maddikunta Saikiran |
Sheikh Hasina : అమెరికాపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికయే తమ ప్రభుత్వ పతనానికి కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు.ఒక ప్రముఖ పత్రికతో హసీనా మాట్లాడూతూ.. 'మృతదేహాల ఊరేగింపును చూడకుండా ఉండటానికె నేను రాజీనామా చేశాను. విద్యార్థుల మృత దేహాలపై వారు అధికారంలోకి రావాలని కోరుకున్నారని హసీనా పేర్కొన్నారని సమాచారం. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అమెరికా సెయింట్ మార్టిన్ దీవి తమకు అప్పగించమని అడిగిందని, ఆ దీవి అమెరికాకు ఇచ్చి ఉంటే నేను అధికారంలో ఉండగలిగేదాన్ని' ఓ పత్రికతో అన్నారని తెలుస్తోంది.

నేను ఇంకా దేశంలో ఉండింటే ఎక్కువ మంది ప్రాణాలు పోయేవని, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినేవని హసీనా తెలిపారు. అలాగే నా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని, వారి ఇళ్లను తగులబెట్టారన్న వార్తలు చూసి నా గుండె రోదిస్తున్నదని ,అల్లా దయతో నా కుటుంబం ప్రాణాలను అర్పించిన దేశం కోసం త్వరలోనే నేను తిరిగి వస్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భావోద్వేగానికి గురయ్యారు.

Next Story

Most Viewed