Tirumala Laddu : టీటీడీ అత్యవసర భేటీ.. లడ్డూ వివాదంపై కీలక నిర్ణయం..!

by srinivas |   ( Updated:2024-09-21 10:57:02.0  )
Tirumala Laddu : టీటీడీ అత్యవసర భేటీ.. లడ్డూ వివాదంపై కీలక నిర్ణయం..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD Board) అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు, ప్రధాన అర్చకుడు, పండితులు, ఈవో శ్యామలారావు (Eo Syamalarao) హాజరయ్యారు. లడ్డూ ప్రసాదం వివాదంపై చర్చిస్తున్నారు. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాలను స్వీకరించారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.

కాగా తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) తయారీలో జంతువుల కొవ్వుల నుంచి వచ్చిన నూనెను వినియోగించారని నిర్ధారణ కావడంతో భక్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని అప్పటి ప్రభుత్వం కొట్టిపారేసింది. కానీ అధికారం మారడంతో లడ్డూ ప్రసాదం నాణ్యతపై శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయించారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారని రిపోర్టులో వెల్లడైంది.

దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ అయింది. శ్రీవారి అన్న ప్రసాదాల్లో వాడే నెయ్యి, బెల్లం, బియ్యం, వంటి గో అధారిత ముడి సరుకులను తాత్కాలికంగా రద్దు చేసింది. లడ్డూ ప్రసాదం వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భేటీ అయింది. కాసేపట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story