- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైడెన్ ప్రైవేట్ ఆఫీస్‌లో రహస్య పత్రాలు.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ ప్రైవేట్(ఒకప్పటి ప్రైవేట్ ఆఫీస్)కార్యాలయంలో రహస్య పత్రాలు లభించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎందుకంటే ఆ పత్రాల్లో కొన్ని దేశాలకు చెందిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై క్రిమినల్ విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ ఆలోచిస్తున్నారట. అయితే అవి తన కార్యాలయంలోకి ఎలా వచ్చాయో తెలియదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటున్నారు.
'ఆ పత్రాల్లో ఏముందో నాకు తెలీదు' అని బైడెన్ అన్నారు. వాషింగ్టన్ లోని పెన్ బైడెన్ సెంటర్‌లో ఈ పత్రాలు లభించాయి. ఈ పత్రాల్లో విదేశాలకు చెందిన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలని రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. జో బైడెన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో రాజీ పడ్డారని ఈ కమిటీ చైర్మన్ జేమ్స్ కామర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై యూఎస్ న్యాయశాఖ కూడా దృష్టిసారించింది. ఆ పత్రాలకు చెందిన అంశాలను వెల్లడించాలని కెంటరీ జిల్లాకు చెందిన కామర్ వైట్‌హౌస్ ను కోరారు. జనవరి 24వ తేదీ ఆ కార్యాలయానికి వెళ్లిన వారి జాబితాను ఇవ్వాలని కామర్ విజ్ఞప్తి చేశారు.