- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. డ్యామ్ పేల్చివేత! (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భారత్ వంటి దేశాలు ఈ యుద్ధాన్ని నివారించేందుకు సూచనలు చేస్తున్నప్పటికీ ఇరుదేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్టను పేల్చేశారు. దీంతో డ్యామ్‌లోని నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. మంగళవారం తెల్లవారుజామున నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చేశారు. అయితే ఈ చర్య రష్యా పనే అని ఉక్రెయిన్ ఆరోపిస్తుంటే రష్యా మాత్రం దీనిని ఉగ్రదాడితో పోల్చింది.
గత కొంత కాలంగా డ్యామ్ ప్రాంతంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి జరిగిన దాడుల్లో గెట్ వాల్వులు దెబ్బతిని లీకులు మొదలయ్యాయి. క్రమంగా నియంత్రించలేని విధంగా నీరు క్రిందకు ప్రవహించడం మొదలు పెట్టింది. ఈ డ్యామ్ వద్ద ప్రమాదకర రీతిలో నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభావితం అవుతుంది అనుకున్న ప్రాంతాల్లో జనాలను అక్కడి నుండి తరలిస్తున్నారు.
The Russian Military is claiming that Ukrainian Armed Force conducted an Attack against the Nova Kakhovka Dam in the Kherson Region a few hours ago with almost the Entire Dam as well as the Kakhovka Hydroelectric Power Plant being Destroyed in the process; throughout the length… pic.twitter.com/wBVUX0sskR
— OSINTdefender (@sentdefender) June 6, 2023