- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మమ్మల్ని క్షమించండి' ప్రెస్‌మీట్‌లో రష్యా బలగాలు!
దిశ, వెబ్‌డెస్క్ః రాజ్యాల మధ్య యుద్ధం నష్టాన్ని, కష్టాన్ని మాత్రమే మిగిల్చిదన్నది చారిత్రక సత్యం. యుద్ధం ఏదైనా అది మనిషిలో మానవత్వాన్ని చంపి, తోటి మనుషుల ప్రాణాలను హరించే మార్గమే తప్ప మరోటి కాదన్నది జగమెరిగిన నిజం కూడా. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కూడా ఇలాంటిదే. అందులోనూ ఈ యుద్ధం రెండు అగ్ర రాజ్యాల కాంక్షలకు బలైన ఓ దయనీయ ఉక్రెయిన్ కథగా కూడా చెప్పొచ్చే. అందుకే, ఇప్పుడు ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఉక్రెయిన్ బలగాలకు పట్టుబడిన రష్యన్ సైనికులు బాధపడుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు 'దండయాత్ర'కు దిగి, ఉక్రెయిన్‌లోని అమాయక పౌరుల్ని, పిల్లల్ని చంపినందుకు క్షమాపణలు చెబుతున్నారు.
ఇటీవల దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తన ప్రసంగంలో, రష్యన్ సాయుధ దళాలకు సందేశం ఇచ్చాడు. యుద్ధం వదిలి వెళ్లిపొమ్మని, తమ ఆయుధాలను వదిలేసిన వారిని ఉక్రెయిన్ మర్యాదగా చూస్తుందని అన్నారు. "మీరు ఎందుకు చనిపోవాలి? దేని కోసం ఈ యుద్ధం చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి?' అని అభ్యర్థించాడు.
ఇక, గత వారం ఉక్రెయిన్ గగనతలంలో రష్యా సైన్యానికి చెందిన యుద్ధ విమానం కూలింది. అందులో ప్రాణాలతో బయటపడిన పైలట్‌లలో ఒకరైన సెర్గీ గాల్కిన్‌కు తాజాగా ఉక్రెయిన్ ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ నుండి మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మాట్లాడిన రష్యన్ సైనికులు తమ దేశ మిలటరీ అధికారుల్ని పిరికిపందలుగా అభివర్ణించారు. కన్నీళ్ల పర్యంతమైన పైలెట్, "ఈ దేశంపైన రష్యా దండయాత్రలో భాగస్తుడిగా ఉన్నందుకు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ఉక్రెయిన్‌లోని ప్రతి పౌరుడికి, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు క్షమాపణలు చెబుతున్నాను" అని అన్నాడు.