- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో దేశంలోకి ఎంటరైన రష్యా ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా.. మరోవైపు ప్రపంచంలోని కీలక ప్రాంతాల్లోనూ తన సైనిక ఉనికిని పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే అతిపేద ఆఫ్రికా దేశం నైగర్‌కు దాదాపు 100 మంది సైనిక శిక్షకులను రష్యా పంపింది. వారితో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా నైగర్‌కు పుతిన్ పంపించారు. ఇతర దేశాల వైమానిక దాడుల నుంచి భూభాగానికి రక్షణ కల్పించడమే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత. ఇది చాలా ఖరీదైనది. వ్యూహాత్మక సైనిక సహకారంలో భాగంగా దీన్ని నైగర్‌కు రష్యా డెలివరీ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే నైగర్‌లోని మిలిటరీ గవర్నమెంట్.. రష్యాతో సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత (2024 మార్చిలో) గత ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. రష్యాతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే నైగర్‌కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందింది. 2023 జులైలో నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రస్తుతం నైగర్ మిలిటరీ జుంటా ప్రభుత్వానికి అబ్దుర్ రహ్మాన్ తచియానీ సారథ్యం వహిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నైగర్‌లో అమెరికాకు కూడా రెండు సైనిక స్థావరాలు, 1000 మంది సైనికులు ఉన్నారు.