- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలింపిక్స్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన రష్యా
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది పారిస్‌లో జరగబోయే ఒలంపిక్స్ నిర్వహణకు రష్యా ఆటంకాలు కలగజేసే అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వాదనలు "ఆమోదయోగ్యం కాదు" అని రష్యా పేర్కొంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఇలాంటి వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ, రష్యా తన మీడియాలో పారిస్ ఒలంపిక్స్ నిర్వహణపై బురదజల్లుతుందని, ఫ్రాన్స్ గేమ్స్‌కు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేకపోతుందనే తప్పుడు ప్రచారాన్ని, పుకార్లను సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగించి వ్యాప్తి చేస్తుందని, రష్యా ఇటీవల ఫ్రాన్స్‌పై ప్రచార దాడులను పెంచిందని ఆయన చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలను రష్యా ప్రతినిధి తప్పుపట్టారు. తమ దేశం ఎప్పుడు అలాంటి పనులు చేయదని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు గత కొన్ని నెలలుగా రష్యాకు వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. మాస్కోను ఓడించాలని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల మధ్య ఒలంపిక్స్‌ను సజావుగా నిర్వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.