తోటి ఉద్యోగితో లేడీ ఆఫీసర్ ఎఫైర్!.. ఇద్దరిని జాబ్ నుంచి తొలగించిన ప్రముఖ బ్యాంక్

by Prasad Jukanti |   ( Updated:2024-05-03 11:21:31.0  )
తోటి ఉద్యోగితో లేడీ ఆఫీసర్ ఎఫైర్!.. ఇద్దరిని జాబ్ నుంచి తొలగించిన ప్రముఖ బ్యాంక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:సహ ఉద్యోగితో రహస్యంగా సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉందన్న కారణంతో రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా తమ సంస్థలో కీలకమైన మహిళా ఆఫీసర్ కు గుడ్ బై చెప్పింది. ఆర్ బీసీ బ్యాంక్ కెనడాలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ఈ సంస్థలో నాదిన్ అహ్వ్ అనే లేడీ ఆఫీసర్ 2021 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పని చేస్తున్నారు. అయితే ఆమె సీక్రెట్ తో తన సహోద్యోగితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె నిర్వాకంపై అంతర్గత విచారణ చేపట్టగా నాదిన్ అహ్న్ మరో ఉద్యోగితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్న మాట వాస్తవమే అని తేలింది. అలాగే ఈ సంబంధం కారణంగా ఆమె తన సహోద్యోగికి ప్రమోషన్, పరిహారం పెంపు వంటి వాటిలో స్పెషల్ ప్రయార్టీ ఇచ్చినట్లు గుర్తించారు.

అయితే వీరి సంబంధం వల్ల బ్యాంకు ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరపకపోయినా సంస్థ ప్రవర్తనా నియమావళికి వీరి వ్యవహారం విరుద్ధంగా ఉందని దాంతో ఆమెతో పాటు ఆమెతో సంబంధం కలిగి ఉన్న సహోద్యోగిని కూడా ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ లో హాట్ టాపిక్ గా మారింది. నాదిన్ అహ్న్ స్థానంలో తాత్కాలిక సీఎఫ్ఓగా ఫైనాన్స్ అండ్ కంట్రోలర్‌ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ కేథరిన్‌ గిబ్సన్‌ను నియమించారు.

Advertisement

Next Story