- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లండన్‌లో రోడ్డు ప్రమాదం: భారత పరిశోధక విద్యార్థిని మృతి
దిశ, నేషనల్ బ్యూరో: లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత పరిశోధక విద్యార్థిని చెయిస్తా కొచ్చర్(33) మృతి చెందింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న కొచ్చర్ ఈ నెల 19న కళాశాల నుంచి సైకిల్ తొక్కుకుంటూ సెంట్రల్ లండన్‌లోని తన ఇంటికి వెళ్తుండగా..ఆమె సైకిల్‌ను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన కొచ్చర్ అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని తాజాగా కొచ్చర్ తండ్రి రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చెయిస్తా స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. ఇది చాలా బాధాకరం. నేనింకా లండన్‌లోనే ఉన్నా చెయిస్తా అవశేషాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నా’ అని లింక్‌డిన్‌లో పోస్టు చేశారు.
చెయిస్తా మరణ వార్తపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ సైతం స్పందించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘చెయిస్తా ఎంతో దైర్య వంతురాలు. ఆమె నీతి ఆయోగ్ యూనిట్‌లో నాతో కలిసి పని చేశారు. ఇంత త్వరగా మన నుంచి దూరం కావడం బాధాకరం’ అని పేర్కొన్నారు. కాగా, చెయిస్తా కొచ్చర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్గనైజేషనల్ బిహేవియర్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లోనే లండన్‌కు వెళ్లారు. అంతకుముందు ఆమె 2021-23 మధ్య కాలంలో నీతి ఆయోగ్‌లోని నేషనల్ బిహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా విధులు నిర్వహించారు.