- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్‌లో రెడ్ కార్పెట్ నిషేధం: ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ నూతన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లే సమయంలో రెడ్ కార్పెట్‌లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో రెడ్ కార్పెట్ ఉపయోగించడంపై నిషేధం విధించారు. కేవలం విదేశీ అతిథులను ఆహ్వానించడానికి మాత్రమే దానికి ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా ప్రభుత్వ నిధులను ఆదా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అయ్యే ఖర్చును ఇతర రంగాలకు మళ్లించొచ్చని తెలుస్తోంది. అయితే విదేశీ అతిథులు దేశానికి వచ్చినప్పుడు మాత్రం వారిని స్వాగతించేందుకు ప్రొటోకాల్‌గా రెడ్ కార్పెట్ వాడనున్నారు. అంతేగాక ప్రధాని హోదాలో వచ్చే వేతనాన్ని సైతం షెహబాజ్ వదులుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాని నిర్ణయం తర్వాత కేబినెట్ మంత్రులు సైతం తమ శాలరీని వదులుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.