బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రేచెల్ రీవ్స్..దేశ చరిత్రలో తొలి మహిళగా రికార్డు

by vinod kumar |
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా రేచెల్ రీవ్స్..దేశ చరిత్రలో తొలి మహిళగా రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన నియామాకానికి కింగ్ చార్లెస్-3 సైతం ఆమోదం తెలిపారు. దీంతో ఆయన వెంటనే తన పని ప్రారంభించారు. పీఎంగా నియామకమైన కాసేపటికే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేగాక కేబినెట్ కూర్పులో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. రాచెల్ రీవ్స్‌ అనే మహిళను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో ఆ పదవి చేపట్టిన దేశంలోనే మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అలాగే మరో మహిళ అయిన ఏంజెలా రైనర్‌ను ఉప ప్రధానిగా నియమించడంతో పాటు గృహ నిర్మాణ శాఖలు అప్పగించారు. ఇక విదేశాంగ మంత్రిగా డేవిడ్ లామీ, రక్షణ మంత్రిగా జాన్ హీలీ, అంతర్గత మంత్రిగా వైవెట్ కూపర్, విద్యా మంత్రిగా బ్రిడ్జెట్ ఫిలిప్సన్‌లను నియమించారు.

Next Story

Most Viewed