ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు భారత్ మద్దతు..

by Vinod kumar |
ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు భారత్ మద్దతు..
X

ఇస్లామాబాద్ : స్వీడన్‌లో పవిత్ర ఖురాన్‌ను అవమానించిన ఘటనకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్ఆర్సీ)లో పాకిస్థాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రవేశపట్టిన ఈ ముసాయిదా ప్రతిపాదనకు బుధవారం ఆమోదం లభించింది. పాకిస్థాన్ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన దేశాల లిస్టులో భారత్, చైనా కూడా ఉన్నాయి.

యూఎన్ హెచ్ఆర్సీ లో మొత్తం 47 మంది సభ్య దేశాలు ఉండగా.. పాక్ తీర్మానాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, రొమేనియా, లిథువేనియా, కోస్టారికా, ఫిన్లాండ్ సహా 12 దేశాలు వ్యతిరేకించాయి. నేపాల్‌తో సహా ఏడు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. మొత్తం మీద 28 దేశాలు మద్దతిచ్చాయి. గత నెలలో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఓ వ్యక్తి మసీదు ముందు పవిత్ర ఖురాన్‌ను అవమానించాడు. ఈ ఘటనను యూరోపియన్ యూనియన్, పోప్ ఫ్రాన్సిస్, స్వీడిష్ ప్రభుత్వం, అన్ని ఇస్లామిక్ దేశాలు ఖండించాయి.

Advertisement

Next Story

Most Viewed