- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి పాశ్చాత్య దేశాలే కారణం: వ్లాదిమిర్ పుతిన్
దిశ, వెబ్‌డెస్క్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధానికి ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలనుద్దేశించి మంగళవారం ప్రసంగించారు. నాటో కూటమి రష్యా సరిహద్దుల వరకు విస్తరించాలని భావించిందని.. అందువల్లే రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నెలకొందని అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత అని ఆరోపించారు.
ప్రపంచమంతా అమెరికా బలగాలు ఉన్నాయన్నారు. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని.. కానీ సమస్య పరిష్కారానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవని పుతిన్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల వైఖరి వల్లే రష్యా- ఉక్రెయిన్‌ల సమస్య మరింత జఠిలం అవుతోందన్నారు. పాశ్చాత దేశాలు ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లేవియా దేశాలకు పట్టించిన గతే పట్టిస్తాయాని జోస్యం చెప్పారు.
Also Read: మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా అధ్యక్షుడు.... ఈసారి ఏమన్నాడంటే...?