- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nuclear : అణ్వాయుధాల ప్రయోగంపై పుతిన్ సంచలన ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : అణ్వస్త్ర శక్తి కలిగిన ఏదైనా దేశపు సైనిక సాయంతో ఉక్రెయిన్ తమపై ఎటాక్ చేస్తే దాన్ని ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యా అణ్వస్త్ర వినియోగ సిద్ధాంతంలో కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలిపారు. తమ దేశంపైకి పెద్దఎత్తున మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడి మొదలైనా దాన్ని నిలువరించేందుకు అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యాపై కానీ, బెలారస్‌పై కానీ దాడులు తీవ్రతరమైనా అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనే క్రమంలో ఈ అంశాలపై తాము ముందస్తు క్లారిటీ ఇవ్వాల్సి వస్తోందన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రరూపు దాలుస్తోంది. నాటో కూటమి దేశాలు, అమెరికా అందిస్తున్న ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తోంది. రష్యాపైకి సంధించేందుకు ఉక్రెయిన్‌కు క్రూయిజ్ మిస్సైళ్లను ఇచ్చేందుకు కొన్ని నాటో దేశాలు రెడీ అవుతున్నాయి. ఈఅంశంపై చర్చించేందుకు తన ప్రభుత్వంలోని కీలక మంత్రులు, సైనిక విభాగాల ఉన్నతాధికారులతో కూడిన భద్రతా మండలితో బుధవారం పుతిన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగిస్తే ఎలా స్పందించాలి ? ఆ క్రూయిజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు అందించే దేశాలపై ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవాలి ? శత్రుదేశాలపైకి న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించేందుకు సంబంధించిన రూల్స్‌లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఏయే మార్పులు చేయాలి ? అనే అంశాలపై ఈ భేటీలో చర్చించారు.