ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పులు చేసిన కిమ్.. రోడ్డు, రైలు మార్గాలను పేల్చిన సైనికులు

by Ramesh N |
ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పులు చేసిన కిమ్.. రోడ్డు, రైలు మార్గాలను పేల్చిన సైనికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే నార్త్ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. అయితే ఉత్తర కొరియా ప్రస్తుతం ఉపయోగంలో లేని రోడ్లు, రైలు మార్గాలను మూసివేసింది. ఉత్తర, దక్షిణ కొరియాలను కలిపే రహాదారి లింక్‌లను ధ్వంసం చేసినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కింది.

ఈ క్రమంలోనే ఉత్తర కొరియా సైనికులు రెండు దేశాలను కలిపే రోడ్లు, రైలు మార్గాలను పేల్చుతున్న వీడియో ఫుటేజీని దక్షిణ కొరియా సైన్యం మంగళవారం విడుదల చేసింది. కాగా, దక్షణ కొరియాను ప్రధాన శత్రువుగా ప్రకటించాలని కిమ్‌జోంగ్ గత జనవరిలో పిలుపునిచ్చారు. అదేవిధంగా కిమ్ తన ప్రసంగంలో రాజ్యాంగ మార్పులు చేయాలని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా వారి రాజ్యాంగంలో సవరణలు చేసి దక్షిణ కొరియాను శుత్రు దేశంగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed