- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిటన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. గెలుపుపై ధీమాతో రిషి సునాక్, స్టార్మర్
దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో సార్వత్రిక ఓటింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఈ ప్రక్రియ రాత్రి పది గంటల వరకు జరుగుతుంది. మొత్తం 650 నియోజకవర్గాలలో ఓటర్లు కొత్త పార్లమెంటు సభ్యులను ఎన్నుకునే పనిలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ సమీపంలోని పోలింగ్ స్టేషన్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఇతర ప్రముఖులు, సామాన్య ప్రజలు తమ పోలింగ్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.
ఈసారి కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లెఫ్ట్ లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్‌మర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒపీనియన్ పోల్స్ ఇంతకుముందు నివేదించిన దాని ప్రకారం, 14 సంవత్సరాల కన్జర్వేటివ్ పాలనకు ఈ సారి ముగింపు పలికి లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మొత్తం స్థానాల్లో మెజారిటీ కోసం, ఒక పార్టీ కనీసం 326 సీట్లు సాధించాలి. ఈ ఎన్నికల్లో 98 వివిధ రాజకీయ పార్టీల నుండి మొత్తం 4,515 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 459 మంది స్వతంత్రులు ఉన్నారు. మహిళా అభ్యర్థులు 20 శాతం వరకు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 46 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా 40,000 పోలింగ్ స్టేషన్లను ఓటింగ్‌కు అందుబాటులో ఉంచారు.