Israels embassy: డెన్మార్క్ దౌత్య కార్యాలయాల వద్ద పేలుళ్లు

by Shamantha N |
Israels embassy:  డెన్మార్క్ దౌత్య కార్యాలయాల వద్ద పేలుళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ డెన్మార్క్‌లోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయాల వద్ద పేలుళ్లు కలకలం సృష్టించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్ శివార్లలోని భవనాలకు అత్యంత సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనాస్థలిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటనపైన డెన్మార్క్‌లోని ఇజ్రాయెల్‌ దౌత్య సిబ్బంది ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. డెన్మార్క్ పేలుళ్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకొన్న యూనిట్‌ 910 మళ్లీ రంగంలోకి దిగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ యూనిట్ ని బ్లాక్‌ యూనిట్‌ లేదా షాడో యూనిట్‌ అని వ్యవహరిస్తారు. హెజ్‌బొల్లాలో అది ఓ కోవర్ట్‌ విభాగం. గతంలో అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలో ఇజ్రాయెల్‌ వాసులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులు చేసింది. దాదాపు 32 ఏళ్ల క్రితం కూడా నాటి హెజ్‌బొల్లా నాయకుడు అబ్బాస్‌ అల్‌ ముసావిని ఇజ్రాయెల్‌ దళాలు చంపిన సమయంలో ఈ యూనిట్‌ ప్రతీకార దాడులు నిర్వహించింది.

మిత్రదేశాల నుంచి ఇజ్రాయెల్ కు మద్దతు

ఈ ఘటనలో డెన్మార్క్‌ పోలీసులు అప్రమత్తమ్యారు. మిత్ర దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు.. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బానెస్‌ టెల్‌ అవీవ్‌కు మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాలని ఆకాంక్షించారు. మరోవైపు ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ కు బ్రిటన్ సహకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణమంత్రి జాన్‌ హైలీ వెల్లడించారు

Advertisement

Next Story

Most Viewed