రెండోసారి టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్‌.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

by Harish |
రెండోసారి టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగన్‌.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
X

న్యూఢిల్లీ: మరోసారి ఎన్నికైన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం (మే 28, 2023) జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్ విజయం సాధించారు. దేశం అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. భూకంపం వల్ల అనేక నగరాలు నేలమట్టమైనప్పటికీ టర్కీ ప్రజలు ఆయనపై విశ్వాసముంచి అధికారం కట్టబెట్టారు. ‘టర్కీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఎర్డోగన్‌కు అభినందనలు. ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాను’ అని భారత ప్రధాని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story