ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నా.. కానీ ఇంకా సిద్ధం కాలేదు: జో బైడెన్

by Harish |   ( Updated:2023-04-10 17:19:35.0  )
ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నా.. కానీ ఇంకా సిద్ధం కాలేదు: జో బైడెన్
X

వాషింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కానీ దానిని ప్రకటించేందుకు తానింకా సిద్ధపడలేదని చెప్పారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ఈస్టర్ ఎగ్ రోల్‌కు ముందు స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. 2024లో డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ దానిని అధికారికంగా ప్రకటించేందుకు సమయం తీసుకుంటున్నారు. బైడెన్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని బైడెన్ ప్రారంభించడంపై వైట్ హౌస్ అగ్రశ్రేణి సలహాదారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ‘నిర్ణయమైతే తీసుకున్నారు. కానీ దానిని ప్రకటించేందుకు ఒత్తిడికి గురవుతున్నారు’ అని ఈ విషయం బాగా తెలిసిన ఓ వర్గం చెప్పింది.

Advertisement

Next Story